- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
బడంగ్పేట్, అక్టోబర్ 31 : బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ కావడానికి ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారి మహుమ్మద్ యాసిన్ కారణం అంటూ పోస్టర్లు వెలిశాయి.
ఆయన కనబడటం లేదని బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో డోర్లకు స్టికర్లు వెలిశాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేయాలంటే ఫైల్స్‌కు రూ.20వేలు అడుగుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
అయితే సదురు అధికారిపై ఇప్పటికే బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన్నట్లు సమాచారం. మరోసారి ఆయనపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు డీసీ తెలిపారు. మహుమ్మద్ యాసిన్ బైక్‌పై దాదాపుగా 24 కేసులు ఉన్న వివరాలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

