Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్బీనగర్‌లో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు

ఎల్బీనగర్‌లో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్‌లో రోడ్డుపక్కన ఆగివున్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావవత్ అశోక్ కారు నడుపుతుండగా అతనితో పాటుకారులో సరూర్‌నగర్‌కు చెందిన బొర్రా మధు ఉన్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్ర లేఅవుట్ సమీపంలో రోడ్డుపక్కన నిలిపివున్న లారీనీ గమనించని అశోక్ నేరుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అశోక్, మధు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana