Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్పీజీ కొత్త కనెక్షన్లపై కొనసాగుతున్న నిషేధం

ఎల్పీజీ కొత్త కనెక్షన్లపై కొనసాగుతున్న నిషేధం

  • పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణమన్న కేంద్రం

న్యూఢిల్లీ : కొత్త ఎల్పీజీ కనెక్షన్లపై కేంద్రం విధించిన నిషేధం దేశంలో ఇంకా కొనసాగుతున్నది. పశ్చిమాసియా యుద్ధం క్రమంలో ఈ ఏడాది మార్చి నుంచి చమురు కంపెనీలు 14.2 కేజీల గృహ సంబంధ కొత్త కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి.

అయితే ఇప్పటికే కనెక్షన్లు ఉన్న వారికి నిరాఘాటంగా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నందున ఎల్పీజీ ఆశించిన స్థాయిలో దిగుమతి కావడం లేదని కేంద్రం పేర్కొన్నది.

కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే వినియోగదారులకు గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదురు కావచ్చునని, కొత్త కనెక్షన్లపై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఎల్పీజీ సరఫరా సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ పశ్చిమాసియా ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నందున భవిష్యత్‌లో సరఫరాలకు ఇబ్బంది ఏర్పడవచ్చునని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana