తాజావార్తలు
ఎంబీసీల సంక్షేమానికి కేసీఆర్ కృషి

హైదరాబాద్ : అత్యంత వెనుకబడిన కులాల సమగ్ర సంక్షేమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతగానో కృషి చేస్తున్నారని మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు బసవరాజు సారయ్య పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన కులాల వృత్తిదారుల సమావేశం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సారయ్య, సినీ దర్శకులు ఎన్ శంకర్ హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ విడుదల చేసిన టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందని, సమావేశంలో పాల్గొన్న వివిధ కులాల వృత్తిదారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన కులాలన్నీ టీఆర్‌ఎస్‌ను గెలుపించుకోవాల్సిన అవసరముందని ప్రముఖ సినీ దర్శకులు ఎన్ శంకర్ చెప్పారు.
కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల ఉప్పలయ్య, గ్రేటర్ అధ్యక్షుడు కాలియా పహిల్వాన్, గంగపుత్ర సంఘం జాతీయ అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య, నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు లింగంనాయి, ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కలుకూరి రాజు, ఆరె కటిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుఅశోక్, మేదర సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కూనపులి సంఘం నాయ కుడు శ్రీనివాసరావు, పూసల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, రాజ్‌పుత్ క్షత్రియ సంఘం, ఎంబీసీ యునైటెడ్ ఫ్రంట్ మోహన్‌సింగ్ రాజ్‌పుత్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు నిమ్మల వీరన్న, కుమ్మర సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గంగిరెద్దుల సంఘం నాయకులు నర్సింహ పాల్గొన్నారు.