ENE Repeat | తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈ నగరానికి ఏమైంది. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలిసిందే.
ENE Repeat టైటిల్‌తో రాబోతున్న సీక్వెల్‌లో వీఎఫ్‌ఎక్స్ పార్ట్‌తో చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయట. కాగా ఎప్పుడెప్పుడు కొత్త వార్త వస్తుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ అందించారు. సీక్వెల్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తరుణ్ భాస్కర్ టీం ఓ వీడియోను షేర్ చేసింది.
విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ మూవీ ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లిపోయింది. ప్రమోషనల్ కంటెంట్‌ను ప్లాన్ చేసుకునేందుకు సరిపోయేంతగా 2 నెలల సమయం ఉంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను మరోసారి తమ రోల్స్‌లో కనిపించనుండగా.. శ్రీనాథ్ మాగంటి స్థానంలో సుశాంత్‌ను రీప్లేస్ చేశారు. శృజన్ యెరబోలు నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజర్‌గా పని చేస్తున్నాడు. ENE Repeat నవంబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

