వరంగల్
ఎన్నికల బరిలో మాజీ మహిళలు..!
జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : దనసరి అనసూయ అలియాస్ సీతక్క. మాజీ ఎమ్మెల్యే ఈమె. ములు గు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిని. పటేల్ వనజ. ఈమె భూపాలపల్లి నియోజకవర్గం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అభ్యర్థిని. ప్రస్తుత శాసనసభ ఎన్నికల బరిలో దిగిన వీరిద్దరిది విప్లవోద్యమ నేపథ్యం. సీతక్క సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీలో పనిచేసి లొంగిపోయారు. వనజ సీపీఐ (మావోయిస్టు) పార్టీలో పనిచేశారు. సుధీర్ఘకాలం అజ్ఞాత జీవితం గడిపిన ఈమె కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. తొలిసారి వనజ ఎన్నికల బరిలో నిలిచారు. విప్లవపార్టీల్లో కీలకపాత్రలు పోషించిన సీతక్క, వనజ పోరుబాటను వీడిన తరువాత బ్యాలెట్ పో రుకు దిగటం విశేషం.
సీతక్క ములుగు నియోజకవర్గం నుంచి నాలుగోసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగారు. ములుగు మం డలం జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. జనశక్తి పార్టీలో చేరి చాలా సం వత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా ప్రధాన భూమిక వహించారు.
జనశక్తి దళం లీడర్‌గా వ్యవహరించారు. వివిధ హోదాల్లో పని చేసిన తరువాత ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి వచ్చారు. పోరుబాటను వీడిన సీతక్క అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసే అవకాశం కల్పించింది.
తొలిసారి శాసనసభ ఎన్నికల బరిలో దిగిన సీతక్క అప్పట్లో ఓడిపోయారు. ఆమెపై 2004 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య గెలుపొందారు. వరుసగా రెండోసారి సీతక్క 2009 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపై గెలిచారు.
మొదటి సారి సీతక్క అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో సీతక్క ములుగు నుంచి వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో దిగారు. ఈ సారి ఓటమి పాలైయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా చందూలాల్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోదెం వీరయ్య, టీడీపీ అభ్యర్థినిగా సీతక్క తలపడ్డారు. వీరిలో చందూలాల్ గెలుపొందగా వీరయ్య రెండోస్థానంలో నిలిచారు. సీతక్క మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. గతేడాది టీడీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్ దిగిన ఆమె కాం గ్రెస్ పార్టీలో చేరారు.
డిసెంబర్ 7వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని సీతక్క ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించారు. ఇన్నాళ్లు ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి నేతృత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య కూడా ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించడంతో ములుగు అభ్యర్థి ఖరారు ఒక దశలో కాంగ్రె స్ అధిష్టానానికి సవాల్‌గా మారింది. సీతక్క, వీరయ్య ఎవరికి వారే కాంగ్రెస్‌లోని తమ గాడ్ఫాదర్ల ద్వారా పార్టీ అభ్యర్థిత్వం కోసం తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు. చివరకు కాంగ్రెస్ అధిష్టా నం ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క అభ్యర్థిత్వాన్ని ఖ రారు చేసింది.
పోదెం వీరయ్యను భద్రాచలం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది. దీంతో ములుగు నుంచి ఈ సారి సీతక్క కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీకి దిగారు. తొలిసారి పటేల్ వనజ.. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన పటేల్ వనజ స్వగ్రామం భూ పాలపల్లి మండలంలోని నాగారం.
తుపాకీతోనే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే నినాదంతో విప్లవోద్యమంలో అడుగులు వే సిన వనజ దశాబ్దంనర కాలంపాటు సీపీఐ (మావోయిస్టు) పా ర్టీలో పనిచేశారు. అజ్ఞాతంలో పలు బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని దళం డిప్యూటీ కమాండర్‌గా పనిచేశారు. రచయితగానూ ఆమె పార్టీలో గుర్తింపు పొందా రు.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వనజకు అ మరుడు పటేల్ సుధాకర్‌రెడ్డితో వివాహం జరిగింది. సుధాకర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక భూమిక వహించారు. కొన్నేళ్ల క్రితం తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పటేల్ సుధాకర్‌రెడ్డి మృతి చెందారు. ఆయన చనిపోవడానికి ముందే పటేల్ వనజ పోరుబాట వదిలి లొంగిపోయారు.
జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారి బ్యాలెట్ పో రులో దిగారు. ఈ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుం చి బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థినిగా బీఎల్ఎఫ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు కొద్దిరోజుల నుంచే వ నజ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తనను గెలిపించాలని కోరుతూ అ న్నివర్గాల ప్రజలను కలుస్తున్నారు.
బీఎల్ఎఫ్ అభ్యర్థినిగా బరి లో ఉన్నారు. ములుగు నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా పోటీలో ఉ న్న సీతక్క జనశక్తి పార్టీలో, భూపాలపల్లి నుంచి బరిలో నిలిచిన వనజ మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయిన తరువాత బ్యాలెట్ పోరుకు అడుగులు వేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన వీరిద్దరు విప్లవోద్యమంలో మహిళా మావోయిస్టులుగా ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో త మదైన ముద్ర వేయడం, ప్రస్తుత ఎన్నికల్లో మాజీ మహిళా మావోయిస్టు సీతక్క కాంగ్రెస్ నుంచి, వనజ బీఎల్ఎఫ్ నుంచి శాసనసభ ఎన్నికల బరిలో నిలువడం ఆసక్తి రేపుతుంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana