Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా

ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా

న్యూఢిల్లీ, మే 22 : దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదాపడింది. పలు డిమాండ్లను నేరవేర్చాలని డిమాండ్‌చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

కానీ, ఈ సమ్మెను వాయిదావేస్తున్నట్టు ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఫెడరేషన్‌ ప్రకటించడంతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలు తెరిచివుండనున్నాయని, రోజువారి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయని 52 కోట్ల మంది ఖాతాదారులకు ఎస్బీఐ సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana