Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్‌వో టు జీఎం జి.వి.కోటిరెడ్డి పదవీ విరమణ.. ఎస్ అండ్ పీసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

ఎస్‌వో టు జీఎం జి.వి.కోటిరెడ్డి పదవీ విరమణ.. ఎస్ అండ్ పీసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

రుద్రంపూర్, మే 30 : జి.వి.కోటిరెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ అన్నారు.

శనివారం కొత్తగూడెం ఏరియాలో ఎస్‌వో టు జీఎంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన జి.వి.కోటిరెడ్డిని ఎస్ అండ్ పీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమే, కానీ ఆయన సంపాదించిన గౌరవం, అనుభవం, సత్సంబంధాలకు ముగింపు కాదన్నారు.

భవిష్యత్‌లో ఆరోగ్యం, ఆనందం, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో సుఖసంతోషాలతో కూడిన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సేవలు తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి, జె.రాంబాబు, జూనియర్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్, షిఫ్ట్ జమేదార్ కమల్ సింగ్, సీనియర్ సెక్యూరిటీ గార్డులు హానోక్ రాజు, త్రిపాఠి, మల్లికార్జున్, సురేశ్‌, పి.విజయ్‌తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్‌వైజర్లు నూకరాజు, దినేష్ యాదవ్, కామేశ్‌, మురళి, చంటి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana