దంబుల్లా : ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్ పోరులో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ సేన సత్తాచాటింది.
బుధవారం జరిగిన ఆఖరి లీగ్ పోరులో 101 రన్స్ తేడాతో అఫ్గానిస్థాన్-ఏను చిత్తు చేసింది.
తొలుత కెప్టెన్ తిలక్ (59), కుమార్ కుశాగ్ర (58), ప్రియాంశ్ (58) అర్ధసెంచరీలతో భారత్ 50 ఓవర్లలో 319/9 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (38) కూడా రాణించాడు. ఛేదనలో నిశాంత్ సింధు (4/31) ధాటికి అఫ్గ్గాన్..36.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. బహిర్‌షా(57), ఫైజల్ షినోజాద(46) టాప్ స్కోరర్లు.

