Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Foldable iPhone | తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌.. డ్యూయో పేరిట తెచ్చిన యాపిల్‌

Foldable iPhone | తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌.. డ్యూయో పేరిట తెచ్చిన యాపిల్‌

  • డ్యూయో పేరిట తెచ్చిన యాపిల్‌
  • ధర రూ.2,99,900
  • 18 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్‌ మాడళ్లు
  • ధరల శ్రేణి రూ.1,64,900-రూ.1,79,900
  • 12 నుంచి ముందస్తు ఆర్డర్లు..
  • 18న అమ్మకాలు
  • రూ.14,900లతో ఎయిర్‌పాడ్స్‌ 5 ఆవిష్కరణ
  • వాచ్‌ 12, వాచ్‌ అల్ట్రా 4 విడుదల

కూపర్టినో (క్యాలిఫోర్నియా), సెప్టెంబర్‌ 9: ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త. తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ను యాపిల్‌ పరిచయం చేసింది మరి. బుధవారం డ్యూయో పేరిట దీన్ని ఆవిష్కరించింది. అలాగే 18 సిరీస్‌లో ప్రో, ప్రో మ్యాక్స్‌ మొబైల్స్‌ను తీసుకొచ్చింది. ఎయిర్‌పాడ్స్‌ 5, వాచ్‌ 12, వాచ్‌ అల్ట్రా 4లు కూడా విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం యావత్తు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఫీచర్లకు కొదవ లేకుండా వీటిని యాపిల్‌ తీసుకురావడం విశేషం. డిస్‌ప్లే, కెమెరా, స్టోరేజీ, బ్యాటరీ సామర్థ్యం, పనితీరు అన్నింటా మేటిగా నిలబెట్టింది. కాగా, దేశీయ మార్కెట్‌లో శనివారం నుంచి ముందస్తు ఆర్డర్లు చేసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

  • డ్యూయో ప్రారంభ ధర 1,999 డాలర్లు (భారత్‌లో రూ.2,99,900).
  • 7.6 అంగుళాల డిస్‌ప్లే.
  • రెండు 48 మెగాపిక్సల్‌ ఫ్యూజన్‌ మెయిన్‌, అల్ట్రావైడ్‌ కెమెరాలు.
  • 256జీబీ నుంచి 2టీబీ స్టోరేజీ సామర్థ్యం.
  • అక్టోబర్‌ 16న డ్యూయో ప్రి-ఆర్డర్లు, 23 నుంచి అమ్మకాలు మొదలు.
  • 18 ప్రో 256జీబీ ప్రారంభ ధర 1,199 డాలర్లు (భారత్‌లో రూ.1,64,900).
  • 18 ప్రో మ్యాక్స్‌ 256జీబీ ప్రారంభ ధర 1,299 డాలర్లు (భారత్‌లో రూ.1,79,900).
  • 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీ స్టోరేజీ వేరియేషన్లు.
  • ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 18 ప్రో బ్యాటరీ లైఫ్‌ 24 గంటలదాకా, ప్రో మ్యాక్స్‌ 30 గంటలదాకా పనిచేస్తుంది.
  • దాదాపు 15 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్‌. 5 నిమిషాలు చార్జింగ్‌ చేస్తే 6 గంటలదాకా వీడియోలను చూడవచ్చు.
  • వేరియబుల్‌ అపెర్చర్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతినిచ్చే 48 మెగాపిక్సల్‌ ఫ్యూజన్‌ మెయిన్‌ కెమెరా.
  • మరే స్మార్ట్‌ఫోన్‌లో లేనివిధంగా శక్తివంతమైన ఏ20 ప్రో చిప్‌సెట్‌.
  • డీప్‌ బ్లాక్‌, రిఫైన్డ్‌ సిల్వర్‌, గ్లేసియర్‌ బ్లూ, న్యూ బర్గండీ కలర్లలో ఐఫోన్లు లభ్యం.
  • వైర్‌లెస్‌ చార్జింగ్‌ కేస్‌ లేని ఎయిర్‌పాడ్స్‌ 5 ధర రూ.14,900. కేస్‌ ఉన్నవి రూ.17,900.
  • యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12 ధర 399 డాలర్లు (రూ.37,956). వాచ్‌ అల్ట్రా 4 ధర 799 డాలర్లు (రూ.76,000)
  • బుధవారం నుంచే స్మార్ట్‌ వాచీల ప్రీ-ఆర్డర్లు మొదలు. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభం.

Airpods

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana