జైపూర్: రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ కుట్ర చేస్తున్నదంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రతిపక్షంపై మండిపడగా.. అశోక్ గెహ్లాట్ ఆరోపణలు శుద్ధ అబద్ధమని బీజేపీ కొట్టిపారేసింది. అశోక్ గెహ్లాట్ ఒక కన్నింగ్ పొలిటీషియన్ అని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా విమర్శించారు. తన పరిపాలనా వైఫల్యాలను కప్పపుచ్చుకోవడానికి గెహ్లాట్ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నిజానికి ఎవరు రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారో గెహ్లాట్‌కు తెలుసని పూనియా చెప్పారు.

