Dailyhunt
ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే చిరుమర్తి జన్మదిన వేడుకలు

కట్టంగూర్‌(నకిరేకల్‌), ఏప్రిల్‌ 20 : నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నడికుడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్‌, పట్టణాధ్యక్షుడు నడికుడి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. కట్టంగూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, పార్టీ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు వడ్డె సైదిరెడ్డి, పట్టణాధ్యక్షుడు బొల్లెద్దు యాదయ్య పాల్గొన్నారు.

చిట్యాల: మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, కూరెళ్ల లింగస్వామి, కర్నాటి ఉప్పల వెంకట్‌రెడ్డి, బెల్లి సత్తయ్య, వనమా వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, కోనేటి కృష్ణ, బొర్రారెడ్డి, సిలివేరు శేఖర్‌, పాటి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్‌ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్యకు పూల మొక్క అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

నార్కట్‌పల్లి : స్థానిక పోలీస్‌ కాంప్లెక్స్‌ వద్ద ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుబ్బాక పావనీశ్రీధర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana