Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గిల్‌కు గాయం!

గిల్‌కు గాయం!

తిరువనంతపురం: వెస్టిండీస్‌తో ఈ నెల27న మొదలయ్యే వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టులో గాయాల కలకలం రేగింది. శుక్రవారం జరిగిన నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో పేసర్‌ సిరాజ్‌ విసిరిన షార్ట్‌ పిచ్‌ బంతి కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మోచేతికి బలంగా తాకింది.

నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన గిల్‌కు వైద్య సిబ్బంది దాదాపు 20 నిమిషాల పాటు చికిత్స అందించారు.

తర్వాత గిల్‌ తిరిగి నెట్స్‌లోకి వచ్చి త్రోడౌన్స్‌ ఎదుర్కొన్నాడు. మరోవైపు, దిగ్గజ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఈ నెల 23న తిరువనంతపురం చేరుకున్న వెస్టిండీస్‌ జట్టు ఇప్పటివరకు ప్రాక్టీస్‌కు దిగలేదు. విండీస్‌ బోర్డు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ ఫీజుల్లో 25 శాతం కోత విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana