Dailyhunt
గోదావరి జలాలకు స్పీకర్‌ పోచారం పూజలు

గోదావరి జలాలకు స్పీకర్‌ పోచారం పూజలు

నాగిరెడ్డిపేట్‌/నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 22: సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ ద్వారా వదిలిన గోదావరి జలాలు గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండలంలోని వెంకంపల్లి బ్రిడ్జివద్దకు చేరుకున్నాయి. వా టికి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మకు స్వాగతం పలికారు. నాగిరెడ్డిపేట్‌ మండలానికి చేరుకున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్‌ పోచారం గతాన్ని తలుచుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఎంతో కష్టాలను అనుభవించారని, ఎంత మొత్తుకున్నా చుక్కనీరు ఇచ్చేవారు కాదన్నారు. తెలంగాణ వచ్చాక దర్జాగా నీటిని తెచ్చి ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అని చెప్పుకుం టూ కన్నీరు పెట్టుకున్నారు.

కార్యక్రమంలోఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేందర్‌, హన్మంత్‌షిండే, జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

17వ రోజు 24 కి.మీ
ఏప్రిల్‌ 22: గోదావరి నీటిని కొండపోచమ్మ సాగర్‌ ద్వారా హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌లోకి సీఎం కేసీఆర్‌ ఈనెల 6వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల వద్ద నిజాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌లోకి చేరాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana