Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gold Rate | మూడు రోజులుగా దిగొచ్చిన బంగారం ఒక్కసారిగా యూటర్న్‌.. భారీగా పెరిగిన ధరలు..!

Gold Rate | మూడు రోజులుగా దిగొచ్చిన బంగారం ఒక్కసారిగా యూటర్న్‌.. భారీగా పెరిగిన ధరలు..!

Gold Rate : భారత్‌లో బంగారం ధరల (Gold price) కు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు గురువారం ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు పెరిగాయి.

డాలర్ (Dallor) బలహీనపడటం, యూఎస్ బాండ్స్‌ (US bonds) పై రాబడులు తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పుంజుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం (సెప్టెంబర్ 3) ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,333 పెరిగింది.

దాంతో తులం 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,55,350 కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,020 మేర పెరిగి రూ.1,42,400కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,510 కి ఎగబాకింది. ఇక వెండి విషయానికి వస్తే నగరంలో కిలో వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.5 వేల మేర పెరిగి రూ.2.5 లక్షలకు చేరుకుంది. అయితే ఈ ధరల్లో దేశంలోని వేర్వేరు నగరాల్లో స్వల్ప తేడా కనిపిస్తోంది.

చెన్నై, ముంబై, పుణె, కోల్‌కతా, బెంగళూరు, తిరువనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,350 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,400 గా ఉన్నది. వడోదరలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,400 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,450 గా ఉన్నది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,55,500 గా ఉన్నది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.1,42,550 గా ఉన్నది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana