బహుముఖ ప్రజ్ఞశాలి గొల్లపూడి మారుతి రావు మూడు రోజుల క్రితం చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన బంధువులు అందరు విదేశాలలో ఉన్న క్రమంలో ఈ రెండు రోజులు భౌతిక కాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచి శనివారం అభిమానుల సందర్శనార్ధం స్వగృహానికి తరలించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, భానుచందర్, నటీమణులు సుహాసిని, ప్రభ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు రాజకీయ, పారిశ్రామిక వేత్తలు గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. చిరు ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం 2.30ని.ల తర్వాత టి.నగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలుస్తుంది. మారుతీరావుది, నాది గురుశిష్యులాంటి బంధం.

