Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రేటర్‌ @ 39.0 డిగ్రీలు

గ్రేటర్‌ @ 39.0 డిగ్రీలు

సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకేసారి 3.5డిగ్రీలు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి ఏకంగా 4 డిగ్రీలు తగ్గిపోయాయి.

దీంతో నగర వాతావరణం కొంత చల్లబడి, జనం ఊపిరి పీల్చుకున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, రాగల రెండు మూడు రోజులు గ్రేటర్‌లోని చాలా చోట్ల రాత్రి సమయాల్లో వేడి గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana