Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుండు చేయించుకుంటే.. గుర్తించని యాప్.. ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడ్డ లోపాలు

గుండు చేయించుకుంటే.. గుర్తించని యాప్.. ఉపాధి హామీ సాఫ్ట్‌వేర్‌లో బయటపడ్డ లోపాలు

పాధి హామీ పథకంలో హాజరు నమోదుకు కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు బయటపడుతున్నాయి. ఓ కూలీ గుండు చేయించుకుని ఉపాధి పనులకు వెళ్లగా..

మొబైల్ సాఫ్ట్‌వేర్ అతడి ముఖాన్ని గుర్తించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎంతసేపటికీ ఫేస్ రికగ్నిషన్ కాకపోవడంతో.. చివరకు పక్కనే ఉన్న మహిళ జుట్టును తలపై కప్పి ఫొటో దిగిడంతో యాప్ అటెండెన్స్‌ను అంగీకరించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మల్యాల శ్రీను రెండు రోజుల క్రితం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని తలనీలాలు సమర్పించాడు. గురువారం నాడు ఉపాధి పనులకు వెళ్లగా.. హాజరు సమయంలో నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అతని ముఖాన్ని గుర్తించలేదు. పలుమార్లు ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో నల్లటి బొగ్గుతో గడ్డం, మీసాలు దిద్దుకుని.. తలపై వెంట్రుకలు ఉన్నట్లు ఓ మహిళ జుట్టును పెట్టుకోగా.. యాప్ గుర్తించింది. ఇది కాస్త అక్కడ ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana