Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైడ్రా.. ఇదేనా నీతి!

హైడ్రా.. ఇదేనా నీతి!

కూకట్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ నంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న 13.17 ఎకరాల భూమికి సంబంధించి గత వారం హైడ్రా.. ఈ భూమి ఈదులకుంట.. ప్రభుత్వస్థలమంటూ..

అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించింది. భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి..హైడ్రా సంరక్షణలో ఉందంటూ.. బోర్డులు కూడా పెట్టింది.. హైడ్రా చేసిన విధ్వంసంపై ఆ స్థలం తమదేనంటూ.. అనేక ఉత్తర్వులు, స్థానిక , జల్లా అధికారులు ఇచ్చిన తీర్పులు.. హైకోర్టు ఉత్తర్వులు చూపించినా.. హైడ్రా మాత్రం అవేవీ ఖాతరు చేయలేదు సరికదా..తాజా గా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ధిక్కరించింది.

కూకట్‌పల్లి పరిధిలో ప్రభుత్వ స్థలమంటూ..హడావుడి చేసిన హైడ్రా..ఖైరతాబాద్‌లో ఓ కాంగ్రెస్‌ మాజీ ప్రజాప్రతినిధి సర్కార్‌ స్థలాన్ని కబ్జా చే సి.. 5 అంతస్తుల భవనాన్ని నిర్మించినా.. చర్యలు తీసుకోలేని వైనమిది.. హైడ్రా ద్వంద్వ నీతికి అద్దం పడుతున్న చిత్రాలివి..

మరి ఖైరతాబాద్‌లోని నెహ్రూనగర్‌ హనుమాన్‌ దేవాలయం ఎదురుగా ప్రభుత్వ స్థలాన్ని ఓ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధి దర్జాగా కబ్జా చేసి.. ఏకంగా 5 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు.. కంటికి ఎదురుగా కనిపిస్తున్న ఈ నిర్మాణం వైపు.. సర్కార్‌ స్థలం రక్షకులం అని చెప్పుకొనే హైడ్రా కన్నెత్తి కూడా చూడటం లేదు..అధికార పక్షం నేత అని ఊరుకుంటున్నదా.. కూల్చేదమ్ములేదా..అంటూ..హైడ్రా తీరుపై నగరవాసులు మండిపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana