Dailyhunt
Harish Rao | వ్యవసాయ అధికారులపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌

Harish Rao | వ్యవసాయ అధికారులపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్‌

సిద్దిపేట : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao) శనివారం వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. పొద్దు తిరుగుడు( Sunflower) , మొక్కజొన్న ( Maize) , ధాన్యంను నాలుగు రోజుల నుంచి కొనుగోలు చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో హరీష్‌రావు యార్డును సందర్శించి అధికారులతో మాట్లాడి ఆగ్రహం ( Anger ) వ్యక్తం చేశారు.

అధికారులు మార్కెట్ యార్డును సందర్శించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, పంట కొనుగోలులో నిరక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. నారాయణ కేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో జొన్న కొనుగోలు సెంటర్లను ప్రారంభించ లేదని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు. కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదని మండిపడ్డారు. పలు జిల్లాల లో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలని కోరారు.

పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు . బీసీ డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి బీసీ లను మోసం చేశారని, కేసీఆర్ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించారని గుర్తు చేశారు. బీసీ లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని, బీసీ విద్యార్థుల ఫీజు రియాంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana