Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hindu Temple: పాకిస్తాన్‌లో మదరస కోసం.. 100 ఏళ్ల క్రితం నాటి ఆలయం ధ్వంసం

Hindu Temple: పాకిస్తాన్‌లో మదరస కోసం.. 100 ఏళ్ల క్రితం నాటి ఆలయం ధ్వంసం

స్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్సులో ఉన్న ఓ వందేళ్ల క్రితం నాటి ఆలయాన్ని(Hindu Temple) ధ్వంసం చేశారు. గత నెలలో జరిగిన ఆ ఘటన గురించి ఓ నివేదిక విడుదలైంది.

అయితే సమీపంలో ఉన్న మదరస నిర్మాణం కోసం ఆలయాన్ని కూల్చినట్లు చెబుతున్నారు. 125 ఏళ క్రితం నాటి ఆ ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని స్థానిక ప్రజలు, మైనార్టీ సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆలయం సమీపంలో జరిగిన ఆక్రమణలను తొలగించాలని వారంతా ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కోరారు.

నిషేధిత తెహ్రీక్ ఇ లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూపు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఆ వందేళ్ల నాటి ఆలయం కూలినట్లు ప్రభుత్వం చెప్పింది. నోరోవాల్‌లోని సిరాజ్ గ్రామంలో దాదాపు వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆ ఆలయం ఉన్నది. ఇది లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

హిందూ ఆలయాన్ని కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం మరియం నవాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ మసిహ మిలిటా పార్టీ కోరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana