Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hit and Run Case | గంజాయి మత్తులో హిట్‌ అండ్ రన్‌ కేసు నిందితుడు సందీప్.. వీడియో

Hit and Run Case | గంజాయి మత్తులో హిట్‌ అండ్ రన్‌ కేసు నిందితుడు సందీప్.. వీడియో

Hit and Run Case | హిట్ అండ్ రన్ కేసులో టీటీడీ బోర్డ్ మెంబర్, పాపులర్‌ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే.

సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రాయదుర్గం పీఎస్‌కు తరలించారు. రాయదుర్గం పీఎస్‌లో సందీప్‌ ఓ చైర్‌లో కూర్చున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు సందీప్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సందీప్‌ గంజాయి సేవిస్తూ మత్తును ఎంజాయ్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఔటర్ రింగ్ రోడ్డు రోటరీ నుంచి ఖాజాగూడ మెయిన్ రోడ్డు మార్గంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సందీప్ అతివేగంగా నడుపుతూ వచ్చిన కారు రోడ్డు దాటుతున్న నందులాల్‌ను తీవ్రంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న నందులాల్‌ను కాపాడేందుకు జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి స్పందించి, తన కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ మార్గంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సందీప్ కారును మరో మహీంద్రా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ అనూహ్య పరిణామాల మధ్య గాయపడిన నందులాల్ మృతి చెందాడు. ప్రమాదానికి పాల్పడిన తర్వాత వెనుక నుంచి ఢీకొట్టిన మహీంద్రా కారు ఏమాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిపుణుల సాయంతో ప్రమాదానికి కారణమైన సందీప్ కారుతోపాటు, దానిని ఢీకొట్టి వెళ్లిపోయిన మహీంద్రా కారును గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana