హైదరాబాద్: కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమల మంత్రి, బాలసోర్ ఎంపీ ప్రతాప్ సారంగి.. ఢిల్లీలోని తన నివాసంలో క్వారెంటైన్ అయ్యారు. గత వారం రెండు కార్యక్రమాల్లో ఒడిశాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యతో ఆయన కలిసి పాల్గొన్నారు. ఆ ఎమ్మెల్యేకు కోవిడ్ పరీక్షలో పాజిటివ్ రావడం వల్ల కేంద్ర మంత్రి హోంక్వారెంటైన్ అయ్యారు. ఎమ్మెల్యే సుకాంత కుమార్ నాయక్‌తో వేదికను పంచుకున్నానని, అందుకే జాగ్రత్త తీసుకుంటున్నట్లు ఆయన ఓ ట్వీట్‌లో వెల్లడించారు. ఎమ్మెల్యే నాయక్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు హోంక్వారెంటైన్ అయినట్లు మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు.

