Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HOTD S3 | 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3 ట్రైలర్ రిలీజ్.. జూన్ 22 నుండి స్ట్రీమింగ్!

HOTD S3 | 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3 ట్రైలర్ రిలీజ్.. జూన్ 22 నుండి స్ట్రీమింగ్!

House Of The Dragon Season 3 | హాలీవుడ్ పాపులర్ ఫాంటసీ డ్రామా సిరీస్ 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' సీజన్ 3 ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే..

వెస్టరోస్ సామ్రాజ్యంలో ఐరన్ థ్రోన్ కోసం జరిగే భీకర పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

రక్తపాతం లేకుండా కింగ్స్ ల్యాండింగ్ నగరాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రైలర్ ప్రారంభంలో రాన్యా టార్గేరియన్ చెప్పినప్పటికీ, పరిస్థితులు దానికి భిన్నంగా మారి ఆమె తన డ్రాగన్లు, సైన్యంతో నగరాన్ని ముట్టడించడం, అది అగ్నికీలల్లో చిక్కుకోవడం ఇందులో చూపించారు. ముఖ్యంగా అత్యంత రక్తపాతంతో కూడిన నౌకా యుద్ధంగా పేరొందిన ‘బాటిల్ ఆఫ్ ది గల్లెట్’ను ఈ సీజన్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రేజీ సిరీస్ భారతదేశంలో జూన్ 22 నుంచి ‘జియోహాట్‌స్టార్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana