Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IBPS Jobs | గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు

IBPS Jobs | గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు

IBPS Jobs | ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) బ్యాంకింగ్‌ రంగంలోని ఖాళీలను భర్తీ చేసే సంస్థ. స్వయంప్రతిపత్తి సంస్థ అయిన ఇది దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అర్హులైన ఉద్యోగులను ఎంపిక చేస్తుంది.

తాజాగా రీజినల్‌ గ్రామీణ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న 13,706 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 8183 ఆఫీస్‌ అసిస్టెంట్‌, 4256 ఆఫీసర్‌ (స్కేల్‌ 1, 2, 3) పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుంది.

ఖాళీల వివరాలు
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) 8183
ఆఫీసర్‌ స్కేల్‌ 1 (అసిస్టెంట్‌ మేనేజర్‌) 4256
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) 666
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (ఐటీ ఆఫీసర్‌) 182
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (చార్టెర్డ్‌ అకౌంటెంట్‌) 81
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (లా ఆఫీసర్‌) 46
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (ట్రెజరీ మేనేజర్‌) 18
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (మార్కెటింగ్‌ ఆఫీసర్‌) 16
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌) 38
ఆఫీసర్‌ స్కేల్‌ 2 (సీనియర్‌ మేనేజర్‌) 220

Rrb Jobs

అర్హతలు
సంబంధిత పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, సీఏ, లా పాసై ఉండాలి. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌, మార్కెటింగ్‌ తదితర సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి. వయసు పోస్టును బట్టి 18 నుంచి 40 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175, మిగతా అభ్యర్థులు అందరికి రూ. 850.

ఎంపిక
ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌, మెయిన్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (LPT) ఉంటుంది. మిగతా పోస్టులకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది. ఎంపికైన వారికి ఆఫీస్‌ అసిస్టెంట్లకు రూ. 35,000-37,000, స్కేల్‌ 1 ఆఫీసర్‌కు రూ. 75,000-77,000, స్కేల్‌ 2 ఆఫీసర్‌కు రూ. 65,000-67,000, స్కేల్‌ 3 ఆఫీసర్‌కు రూ. 80,000-90,000 వరకు జీతం ఉంటుంది.

Online Apply

పరీక్ష కేంద్రాలు
తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, ఏపీలోని అనంతపూర్‌, చీరాల, గుంటూర్‌, హైదరాబాద్‌, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యతేదీలు
దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 21 వరకు కొనసాగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లేదా డిసెంబర్‌లో, మెయిన్స్‌ జనవరి 2027లో ఉంటుంది. దరఖాస్తు, ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ www.ibps.inలో చూడండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana