పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ బుధవారం పెట్టిన కామెంట్ వైరల్‌గా మారింది. "కేసీఆర్ ప్రభుత్వంలో ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్ చేసే పనిని గౌరవ సీఎం గారి ప్రభుత్వంలో అనేక శాఖల అత్యున్నతస్థాయి అధిపతులు పరిశీలిస్తుండటం చాలా గొప్ప మార్పు కదా!
అయినా వర్షాకాలం వచ్చాక ఇలా చూస్తే పరిష్కారం దొరుకదు. ముందుచూపుతో స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ వంటి ప్రాజెక్టులను చేపట్టాలి కదా! అని ఆయన కామెంట్ చేశారు.
ఈ నెల 9వ తేదీన కురిసిన తొలివానకే హైదరాబాద్ అతలాకుతలం కావడం, ఎక్కడికక్కడ వాననీరు నిలబడిపోవడం, మురుగు నీరు బయటకు వెళ్లకపోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహించారు. అధికారులు తన మాట వినకపోవడం వల్లే సిటీ జలమయం అయ్యిందని ముఖ్యమంత్రి 14వ తేదీన కోప్పడ్డారు. దీంతో వరద ముంపు తప్పించే చర్యల కోసం ఉన్నతాధికారులంతా 16వ తేదీన పర్యటనకు వచ్చి ఇలా పరిశీలించారు. ఈ బృందంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఇతరులు ఉన్నారు.

