Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇలవర్స

ఇలవర్స

మా బాసంటే మాకు పాయిరమే మా యాసంటే మాకు పేమే
తినుస్కారమొద్దు
తిట్లపడకు..కంట్లే పడకు
కారం కొట్టుకోకు
ఎప్పుడు రగులుతదో తెలువని
మంట తెలంగాణ

గతిలేనోడికి కుతిలావట

అతీగతీ లేదా?
మీ వొల్ల ఏసుకు (కీర్తికి) తెచ్చుకో
యేరు పడ్డం..తావులు యేరైనయి
ఎవల రేవు వాళ్ళకైంది
యేందిది? ఎందుకిది?
కొట్లాటలొద్దు
కొర్కాసులొద్దు
ఎల్యం చెయ్యకుండ్రి
మాల్యమ్‌ కుదురుకుంటది
నియంతలను నిలేసిన జాగ
కుల్లును కూల్చేసిన తలంల
పగ పెంచే పాగాలొద్దు
త్యాగాల మీద కట్టుకున్న గూడు

జాగీర్‌లు వొద్దు
జగడాలొద్దు
కాయ కొరుకుడు మాటలు వద్దే వద్దు
అన్నదమ్ములమ్‌ అంతరాలొద్దు
ఆగమ్‌ గావొద్దు

దక్షిణాది వాటా అడుగుదాం పా
అన్నీ మరిసి అలయ్‌
బలయ్‌ తీసుకో
తినేతందుకు రా..
కడుపునిండా తిండి పెడ్తం
కండ్లారా నిద్ర దొరుకుతది

తిట్టకు..పట్టుపట్టి
మా బువ్వల మట్టి కొట్టకు
తెంపిన ముడి కుదురది
తెగిన కట్ట నిల్వది
ఎద్దుకు ఎగేసే బర్రెకు సగేసే
రెండు నాల్కలొద్దు
జిద్దులొద్దు..ఏడుపులు ఎకసెక్కలొద్దు

ఇలవర్సల బుద్ధులు చెప్పుతమ్‌
ఇడుపుకాయితమే కాదు
ముందుతరాలకు మా
బాస ముడుపు కడుతమ్‌
యాస ఒడుపు నేర్పుతమ్‌

-డా. సిద్దెంకి
9441244773

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana