Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇళ్లిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

ఇళ్లిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఆర్‌సీ పురం పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి దాదాపు 50 కార్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ లక్షల్లో నగదు వసూలు చేశారని పేర్కొన్నారు. జనవరిలో ఈ ముఠాపై కేసు నమోదుచేశామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana