India vs New Zealand | హామిల్టన్(Hamilton) వేదికగా న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాకు(Team India) ఆదిలోనే షాక్ తగిలింది.
ఇద్దరు ఓపెనర్లు త్వరత్వరగా ఔటయ్యారు. ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ(1) కేవలం ఒక్క పరుగు చేసి ఆడం మిల్నె బౌలింగ్‌లో డరెల్ మిచెల్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో తడబడుతున్న సంజూ శాంసన్(4) పరుగులే చేసి బ్రాస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు ఆడమ్ మిల్నే దక్కించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (25పరుగులు), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (12 పరుగు)తో క్రీజులో ఉన్నారు.
భారత్ 5.2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 25పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌కు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మయాంక్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇక టింక్నర్ తుదిజట్టులోకి వచ్చినట్లు కివీస్ కెప్టెన్ సాంట్నర్ తెలిపాడు.

