Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indian rupee | రెండు నెలల గరిష్టానికి రూపీ వాల్యూ.. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా బలపడ్డ రూపాయి..!

Indian rupee | రెండు నెలల గరిష్టానికి రూపీ వాల్యూ.. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా బలపడ్డ రూపాయి..!

Indian rupee : రూపాయి చరిత్ర (Rupee History) లో సెప్టెంబర్ 3 ను శుభదినంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ రూపీ (Indian Rupee) ఇవాళ భారీ లాభాలను నమోదు చేసింది.

అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (RBI) చర్యల కారణంగా రూపాయి విలువ (Rupee value) రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. అమెరికన్‌ డాలర్‌ (American Dallor) తో పోలిస్తే రూపాయి ఏకంగా 67 పైసలు బలపడి సరిగ్గా 94.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు ముగింపు స్థాయి 94.97 తో పోలిస్తే జూన్ తర్వాత ఇదే అత్యధిక ఒకేరోజు లాభంగా నిలిచింది.

విదేశీ మారకద్రవ్య నిల్వల రూపంలో వచ్చిన డాలర్ల ప్రవాహం ఈ రికవరీకి కారణంగా చెప్పవచ్చు. ఈ ఊహించని పరిణామానికి ప్రధాన కారణం విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (FCNR-B) డిపాజిట్ల ద్వారా భారీగా వచ్చిన నిధులే. మార్కెట్ వర్గాల అంచనా కేవలం 90 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండగా.. వాస్తవానికి ఏకంగా 127 బిలియన్ డాలర్లకు పైగా నిధులు తరలివచ్చినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీనికి ఎక్స్‌టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, ఇతర విదేశీ కరెన్సీ రుణాలను కలుపుకుంటే మొత్తం ఇన్‌ఫ్లోలు 136 బిలియన్ డాలర్లకు చేరాయి.

మార్కెట్ వర్గాలు సుమారు 100 బిలియన్ డాలర్లను మాత్రమే అంచనా వేయగా వాస్తవ లెక్కలతో ట్రేడర్స్ షాక్ అవుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ వ్యూహాలు, డాలర్ల అమ్మకం వంటి చర్యలు రూపాయి బలాన్ని మరింత పెంచాయి. కరెన్సీ మార్కెట్లో ఆర్‌బీఐకి ఇప్పుడు విపరీతమైన వెసులుబాటు లభించిందని, రూపాయి అత్యధిక హెచ్చుతగ్గులకు లోనుకాకుండా రక్షించుకునే శక్తి వచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షిన్హాన్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ కునాల్ సోధాని మాట్లాడుతూ.. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.94.10 నుంచి రూ.95.50 మధ్య కదలాడే అవకాశం ఉందని, రూ.94.10 స్థాయిని దాటితే భవిష్యత్తులో రూ.93.50 స్థాయిని తాకే అవకాశం ఉందని చెప్పారు.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల వద్ద కొనసాగుతుండటం, గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటం రూపాయికి ఇంకా సవాళ్లుగానే మిగిలి ఉన్నాయి. మరోవైపు ఆసియా కరెన్సీలు బలపడటం, డాలర్ ఇండెక్స్ 99.50 కి పడిపోవడం రూపాయికి సానుకూలాంశాలుగా మారాయి. మొత్తానికి విదేశీ నిధుల తాకిడితో రూపాయి పతనావస్థ నుంచి బయటపడి కోలుకోవడం భారత ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే పరిణామంగా మారిందని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana