Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IndiGo Flight: గాలిలో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్‌..  గోవాలో విమానం అత్యవసర ల్యాండింగ్‌

IndiGo Flight: గాలిలో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్‌.. గోవాలో విమానం అత్యవసర ల్యాండింగ్‌

న్యూఢిల్లీ: గోవా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం(IndiGo Flight) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఆ విమానం గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ ఫైల్యూర్ అయినట్లు తెలిసింది.

అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇవ్వడంతో.. మళ్లీ ఆ విమానాన్ని గోవా విమానాశ్రయంలో దించారు. ఇండిగో విమానం 6ఈ 2102 ఇవాళ ఉదయం 9.16 నిమిషాలకు గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో దాన్ని మళ్లీ గోవాకు మళ్లించారు.

ఉదయం 9.30 నిమిషాలకు ఏటీసీ ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందస్తు జాగ్రత్తగా గోవాలో ల్యాండ్ చేశారు. రన్‌వే 28పై ఉదయం 9.51 నిమిషాలకు విమానాన్ని ల్యాండ్ చేశారు. స్టాండ్6లో దాన్ని పార్క్ చేశారు. ప్రయాణికులను ఆ విమానం నుంచి దింపి.. బోర్డింగ్ ఏరియాలో అకామిడేట్ చేశారు. ఫ్లయిట్‌రేడార్‌24 డేటా ప్రకారం దక్షిణ మహారాష్ట్ర తీరం నుంచి గోవాకు ఆ విమానం దారి మళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో విమానం సుమారు 14వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తున్నది. ఫ్లయిట్‌ను సాయంత్రం 3.30 నిమిషాలకు రీషడ్యూల్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana