Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Irumudi 200 | మాస్ మహారాజా ర్యాంపేజ్.. రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి'!

Irumudi 200 | మాస్ మహారాజా ర్యాంపేజ్.. రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి'!

Irumudi | టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మాస్ మహారాజా రవితేజ తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించారు. రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi).

ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, మహిళలు, కుటుంబ సభ్యులు మరియు చిన్నారులను సైతం విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా విడుదలైన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, వీకెండ్స్‌లోనే కాకుండా వీక్‌డేస్‌లో కూడా థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి తగ్గకపోవడం విశేషం. ముఖ్యంగా శివ నిర్వాణ భావోద్వేగాలతో కూడిన స్క్రీన్ ప్లే, రవితేజ కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్, మరియు గూస్‌బంప్స్ తెప్పించే ఎమోషనల్ సీన్స్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. 'స్వామి శరణం' అనే ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు కుటుంబ బంధాల విలువలను కళ్లకు కట్టినట్లు చూపించడం వల్ల రిపీటెడ్ ఆడియెన్స్ విపరీతంగా పెరిగారు.

ఈ అద్భుతమైన ఆదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న 'ఇరుముడి' తాజాగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. దీంతో రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును నమోదు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana