న్యూఢిల్లీ : భారత జాతీయ అంతరిక్ష, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (INSPACe) కింద భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని కేంద్ర అణుశక్తిశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేటు చొరవ, ప్రమేయంపై రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 'ఇస్రో మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం వారికి అనుమతిస్తుంది. అవి భారతదేశంలో మరెక్కడా అందుబాటులో లేవు. వినియోగం కోసం సహేతుకమైన ఛార్జీలు ఉంటాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాల అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి' అని పేర్కొన్నారు. 'అంతరిక్ష కార్యకలాపాలను నిర్వహించడంలో ఇస్రోతో భాగస్వామి అయిన 500పైగా కంపెనీలు ఉన్నాయి.

