Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇటలీ ఫుట్‌బాల్‌ హీరో రోసి మృతి

ఇటలీ ఫుట్‌బాల్‌ హీరో రోసి మృతి

రోమ్‌: ఇటలీకి ప్రపంచకప్‌(1982) సాధించిపెట్టిన ఫుట్‌బాల్‌ దిగ్గజం పవోలో రోసి(64) కన్నుమూశారు. గురువారం నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారని రోసి భార్య ఫెడ్రికా కపెలెటీ వెల్లడించింది. 1982లో ప్రపంచకప్‌ సాధించిన రోసి.. అదే ఏడాది టోర్నీ గోల్డెన్‌బాల్‌, గోల్డెన్‌బూట్‌తో పాటు ప్రతిష్టాత్మక బాలెన్‌ డిఓర్‌(గోల్డెన్‌బాల్‌) అవార్డును అందుకున్నారు. బ్రెజిల్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌ కొట్టిన పవోలో.. ఫైనల్‌లో తొలి గోల్‌ సాధించి మొత్తంగా 1982 మెగాటోర్నీని ఇటలీకి అందించాడు. అయితే ఆయన కెరీర్‌లోనూ ఒడిదొడుకులు ఉన్నాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో 1980 యూరోపియన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి నిషేధానికి గురైన రోసి..

1982లో ప్రపంచకప్‌, గోల్డెన్‌బాల్‌ కైవసం చేసుకొని కెరటంలా ఎగిశాడు. మొత్తంగా 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోసి 20 గోల్స్‌ చేశాడు. క్లబ్‌ కెరీర్‌లో జువెంటస్‌, మిలాన్‌ తదితర జట్ల తరపున 251 మ్యాచ్‌ల్లో 103 గోల్స్‌ సాధించాడు. రోసి మృతి పట్ల ఇటలీ ఫుట్‌బాల్‌ సమాఖ్యతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana