Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jailer 2 | జైలర్ 2' రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!

Jailer 2 | జైలర్ 2' రిలీజ్‌పై క్లారిటీ.. ఆ డేట్‌కి ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ మాస్ జాతర!

Jailer 2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'జైలర్ 2'. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా 'జైలర్' సాధించిన ఘన విజయం తర్వాత సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. అయితే గత కొద్ది రోజులుగా సినిమా విడుదలపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'జైలర్ 2'కు సంబంధించి ఇటీవల చిత్రబృందం నుంచి పెద్దగా ప్రమోషనల్ అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందంటూ అభిమానుల్లో కూడా కొంత గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చి ఈ ప్రచారానికి చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని స్పష్టం చేశారు. 2026 అక్టోబర్ 15న 'జైలర్ 2' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా వాయిదా పడుతుందనే వార్తలకు తెరపడినట్లైంది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావడంతో రజినీకాంత్ అభిమానుల్లో సందడి మొదలైంది. దసరా సీజన్‌కు దగ్గరగా ఈ సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ అంచనా మొదలైంది.

ఇప్పటికే 'జైలర్ 2' నుంచి విడుదలైన 'అలా బొలేలో' పాటకు మంచి స్పందన వచ్చింది. రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పాటను రూపొందించడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.ఇక రిలీజ్ డేట్‌ను అధికారికంగా మరోసారి ప్రకటించిన నేపథ్యంలో ఇకపై ప్రమోషన్లను వేగవంతం చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని పాటలు, టీజర్, ట్రైలర్ వంటి అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్‌ను మరింత పెంచే అవకాశం ఉంది. 'జైలర్ 2'లో రజినీకాంత్‌తో పాటు భారీ తారాగణం భాగమవుతోంది. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, విలక్షణ నటుడు ఎస్‌.జే. సూర్య, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, సీనియర్ నటి రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఇతర ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ స్టార్లు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో 'జైలర్ 2'పై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి మరింత పెరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana