Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

జనచైతన్యం కోసం కవితలు..'రిటర్న్ గిఫ్ట్ 2 కరోనా'

హైదరాబాద్ : "ఏమైందిప్పుడు క్షణాలు మాత్రమే కల్లోలితం..ఆత్మైస్థెర్యాలు కాదు కదా సమూహాలు మాత్రమే సంక్షోభితం..సాయం చేసే గుండెలు కాదు కదా !ఎన్ని చూడలేదు మనంకలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదుకలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడుప్లేగుని జయించిన దరహాసంతోనే కదాచార్మినార్‌ని నిర్మించుకున్నాం..!" 'కరోనాకి ఓ రిటర్న్‌ గిఫ్ట్‌' శీర్షికతో ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి రాసిన కవిత ఇది. క్వారంటైనే మన వాలెంటైన్‌ అంటూ జన చైతన్యానికి దోహదం చేసే అక్షరాల ప్రవాహం ఇది. ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం ఈ కవిత ప్రాముఖ్యతను ప్రస్తావించడం విశేషం. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు కవులందరూ కరోనా కట్టడికి కదం తొక్కుతున్నారు.
తమ ఆలోచనలకు అక్షర రూపమిచ్చి జనానికి దన్నుగా నిలు స్తున్నారు. ప్రముఖ కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మీ 'రిటర్న్‌ గిఫ్ట్‌ 2 కరోనా' పేరుతో యూట్యూబ్‌లో పేజీ ఏర్పాటు చేశారు. సుమారు 400ల మందికి పైగా కవయిత్రులు ఇందులో కరోనాపై కవితలు రాసి..వీడియోలను పోస్టు చేశా రు. ఇప్పటికే ఈ కవితా యజ్ఞం షురూ అయింది.

ప్రస్తుతం సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర వహిస్తుండటంతో యూట్యూబ్‌ను వేదికగా చేసుకుని కరోనాకు భీతిల్లాల్సినవసరం లేదని.. స్వీయరక్షణ చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనాపై అక్షర యుద్ధం ప్రకటించి.. తమ మెదడుకు పనిచెప్తున్నారు సాహితీవేత్తలు.

కరోనాపై అక్షరాల యుద్ధం ప్రకటిస్తున్నాం: అయినంపూడి శ్రీలక్ష్మీ, కవయిత్రికరోనాని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌.. కవుల భుజస్కందాల మీద చక్కటి బాధ్యత పెట్టారు. ఇది కష్టకాలం. కంటికి కనిపించని వైరస్‌ ఇంత పెద్ద ప్రపంచాన్ని సవాల్‌ చేస్తుంది.

మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేయడానికి ప్రయత్నిస్తుంది. అక్షరాయుధాలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన కవులకి ఇదొక పరీక్షా సమయమే. పేపర్లు కూడా ప్రజలకు చేరువ కాలేని దశలో మేం కూడా మా పంథాని మార్చుకుని కవిత్వాన్ని దృశ్యమానం చేశాం. ఒక పాజిటివ్‌ ధృక్పథంతో కవులందరూ కవిత్వాలు రాసి ప్రజల్లో ఆత్మైస్థెర్యాన్ని కలిగిస్తున్నారు.

కరోనాని కట్టడి చేయాలనేది మా ఆశయం. మాకున్న బలం అక్షరం. కరోనాని ఎదురించడంలో సంఘటిత స్ఫూర్తిని చాటుతాం. కవితలతో ప్రభావం చాలా ఉంటుంది: విశ్వైక, కవయిత్రికవులకు ఇదొక మంచి అవకాశంగా భావించాలి.

మనం రాసే అక్షరాలు జనాల్ని చైతన్యం చేసేలా ఉండాలి. వారి అపోహలను తొలగించగలగాలి. ఏది నిజం? ఏది అబద్ధమో?

తేల్చుకోగలగాలి. అయినంపూడి శ్రీలక్ష్మీగారు ఏర్పాటు చేసిన యూట్యూబ్‌ పేజీలో 'రిటర్న్‌ గిఫ్ట్‌ 2 కరోనా' వీడియో ప్రతి ఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉంది. కవితలకు దృశ్యరూపమివ్వడం మంచి నిర్ణయం. అందుకు సంబంధించిన వర్క్‌ అంతా పూర్తయింది.

ఇప్పటికే మహిళా సాహితీ వేత్తలు ప లు వీడియోలు పోస్టు చేశారు. కరోనాపై ఇదొక అక్షర యుద్ధంగానే భావిస్తున్నాం. మా వంతుగా ప్రభుత్వానికి సహాయంగా నిలుస్తాం. కవితలతో ప్రభావం చాలా ఉంటుంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana