Dailyhunt
జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా

లహాబాద్‌ : జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ జడ్జి పోస్టుకు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. నిరుడు ఢిల్లీ హైకోర్ట్‌ జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు లభించడం రాజకీయ, న్యాయ వర్గాల్లో పెను దుమారం రేపింది.

దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపింది.

మొదట ఆ ఘటనతో తనకు సంబంధం లేదని.. ఆ సమయంలో తాను అక్కడ లేనని, తనను ఎందుకు అభిశంసించాలని జస్టిస్‌ వర్మ ప్రశ్నించారు. అయితే ఘటన జరిగిన గదిపై జస్టిస్‌ వర్మ కుటుంబానికి నియంత్రణ ఉందని పార్లమెంటరీ విచారణ కమిటీ తెలిపింది. మరోవైపు ఆయనను అభిశంసించాలని 146 మంది ఎంపీలు చేసిన తీర్మాన ప్రతిపాదన త్వరలోనే పార్లమెంట్‌ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ వర్మ రాజీనామా చేయడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana