Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జెన్‌-జీ రీల్స్‌ హోరు.. బీజేపీ బేజారు!

జెన్‌-జీ రీల్స్‌ హోరు.. బీజేపీ బేజారు!

  • రీల్‌ డ్రివెన్‌ అల్గారిథమ్‌ను అనుసరించడంలో ఫెయిల్‌
  • చివరకు రీల్స్‌ బాటలో మోదీ.. మంత్రులకూ సూచన

హైదరాబాద్‌, ఆగస్టు 1 (స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో, నమస్తే తెలంగాణ): నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనోద్యమం..కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

వాట్సాప్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ మాధ్యమాల ద్వారా సోషల్‌మీడియాలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్న బీజేపీ పరివారం.. జెన్‌-జీల డిజిటల్‌ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవడంలో విఫలమయ్యిందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని చెప్తున్నారు. మంత్రులందరూ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

ఎక్స్‌, వాట్సాప్‌నే నమ్ముకొని..

బీజేపీ సహా దేశంలోని చాలా రాజకీయ పార్టీలు ఇప్పటికీ పార్టీ, ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఎక్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ను వాడుకొంటున్నాయి. యువత మాత్రం తమ వాయిస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రీల్‌ డ్రివెన్‌ అల్గారిథమ్‌ను ఎన్నుకొన్నట్టు చెప్తున్నారు. రీల్‌ డ్రివెన్‌ అల్గారిథమ్‌ ఆధారంగా పనిచేసే వేదికల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కూడా ఒకటి. సీజేపీ ఖాతాకు తొలుత ఫాలోవర్లు లేకపోయినా.. వాళ్లు పోస్ట్‌ చేసిన వినూత్న కంటెంట్‌ లక్షల మందికి చేరింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana