Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం

ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం

మెదక్‌ : జిల్లాలోని ఝరాసంగం కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. పాఠశాలలో మరో ఏడుగురికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. యాంటిజెన్‌ పరీక్షల్లో 12 మంది విద్యార్థినులకు పాజిటివ్‌ రావడంలో మిగిలిన 140 మంది విద్యార్థినులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేశారు. వీరిలో మరో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది. ఆరుగురు విద్యార్థినులు, ఆయా కరోనా బారినపడినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాఠశాలలో ఇప్పటివరకు 19 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బాధితులను హోంక్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో ముగ్గురిలోనే వైరస్‌ లక్షణాలు కనిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana