Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jhunjhunwala : టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు

Jhunjhunwala : టాటాలో పెరిగిన ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు

(Jhunjhunwala) ముంబై : స్టాక్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలుచుకునే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. మరో టాటా గ్రూప్ కంపెనీలో తన పెట్టుబడులను పెంచారు. టాటా మోటార్స్ తర్వాత టాటా కమ్యూనికేషన్స్‌లో తన పెట్టుబడిని పెంచారు.

కంపెనీ షేర్‌హోల్డింగ్ సరళి ప్రకారం, ఝున్‌ఝున్‌వాలా వాటా 1.04 శాతం నుంచి 1.08 శాతానికి పెరిగింది. ఝున్‌ఝున్‌వాలాకు టాటా గ్రూపులోని మూడు కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.

టాటా కమ్యూనికేషన్స్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తన భార్య రేఖ పేరుతో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీలో ఆయన 30,75,687 షేర్లను కలిగి ఉన్నాడు. జూన్ త్రైమాసికంలో రేఖ పేరిట 29,50,687 కంపెనీ షేర్లున్నాయి. ఆ విధంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 1.25 లక్షల కొత్త షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. టాటా కమ్యూనికేషన్స్ షేర్‌ ధర గురువారం రూ.1,433 వద్ద ముగిసింది.

రాకేశ్ ఝున్‌ఝున్ వాలా టాటా మోటార్స్, టైటాన్‌ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. గత కొన్ని రోజులుగా టాటా మోటార్స్ షేర్లు భారీగా పెరిగాయి. ఈ వారం స్టాక్ రూ.497 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో టాటా మోటార్స్ షేర్‌ 32 శాతం పెరిగింది. టాటా మోటార్స్‌లో ఝున్‌ఝున్‌ వాలాకు 1.1 శాతం వాటా ఉంది. ఆయనకు మొత్తం 3.77 కోట్ల షేర్లు ఉన్నాయి. అదేవిధంగా 4.81 శాతం షేర్‌తో టాటా గ్రూప్ కంపెనీ టైటాన్‌లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టారు.

ఇవి కూడా చదవండి..

ఫోన్‌లో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో జాగ్రత్త.. వీటితో వచ్చే సమస్యలు ఇవి!

హైతీలో అమెరికా మిషనరీలు కిడ్నాప్‌

పేదరికం నిర్మూలన ఎప్పటికి సాధ్యమయ్యేను..?

పండ్ల వ్యర్థాల నుంచి కొత్త రకం బ్యాండేజీ.. సింగపూర్‌ శాస్త్రవేత్తల సృష్టి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana