Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జీవితాన్ని ఆవిష్కరించే సహ

జీవితాన్ని ఆవిష్కరించే సహ

కుమార్‌ కాసారం హీరోగా నటిస్తున్న చిత్రం 'సహ'. 'లైఫ్‌ ఆఫ్‌ సంజు' అనేది ఉపశీర్షిక. శ్వేతా లక్ష్మణ్‌, వ్రజన పాండ్య కథానాయికలు.

నిషాంత్‌ దోటి దర్శకుడు. తేజేశ్వర్‌ వెల్పుచర్ల నిర్మిస్తున్నారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

గత పదేండ్లలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని దర్శకుడు నిషాంత్‌ అన్నారు. హీరో సంజు జీవితంలోని బాల్యం, స్కూల్‌ డేస్‌, కాలేజీ, తొలి ప్రేమ, వివాహం.. ఆ తర్వాత చోటుచేసుకున్న భావోద్వేగాలు, మలుపులు ఇలా పలు కీలకమైన దశల్ని ఈ ట్రైలర్‌ ఆవిష్కరించింది. సంజు జీవితంలోకి 'సహ' అనే అమ్మాయి రావడం ఈ ట్రైలర్‌లో మలుపు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ ఉన్నది. సెప్టెంబర్‌ 4న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: కె.కరుణాకర్‌, సంగీతం: శేఖర్‌చంద్ర.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana