లండన్: టీ20 క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా జోస్ బట్లర్(Jos Buttler) రికార్డు నెలకొల్పాడు. ఈ రేసులో అతను రోహిత్ శర్మ పేరిట ఉన్న మైలురాయిని దాటేశాడు.
శ్రీలంకతో సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జోస్ బట్లర్ మంగళవారం ఆ ఘనత అందుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 రన్స్ తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ టీ20ల్లో 4231 రన్స్ చేసి .. అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో 44 బంతుల్లో 80 రన్స్ చేసిన బట్లర్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 4292 రన్స్ ఉన్నాయి. 161 మ్యాచుల్లో అతను ఆ రన్స్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 114 రన్స్ చేశాడతను. ఆ ఇద్దరూ రెండో వికెట్‌కు 128 రన్స్ జోడించారు. జోస్ బట్లర్ 34.33 సగటుతో టీ20ల్లో 4292 రన్స్ చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, 29 అర్థసెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 4596 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 38.94గా ఉంది.

