ఢిల్లీ : మహిళలపై వేధింపులు జూన్ నెలలో అత్యధికంగా నమోదయ్యాయి. జాతీయ మహిళా కమిషన్‌కు జూన్ నెలలో 2,043 ఫిర్యాదులు అందాయి. గడిచిన 8 నెలల్లో ఇదే అత్యధికం. జాతీయ మహిళా కమిషన్ గణాంకాల ప్రకారం జూన్‌లో ఎన్‌సీడబ్ల్యూకి 452 గృహహింస, 603 మానసిక వేధింపులు, వివాహిత మహిళలపై వేధింపులు, వరకట్న వేధింపులకు సంబంధించి 252, మహిళలపై వేధింపులు 194, మహిళల పట్ల పోలీసుల ఉదాసీనతకు సంబంధించి 113, సైబర్ నేరాలకు సంబంధించి 100, అత్యాచారం, అత్యాచారయత్నంకు సంబంధించి 78 ఫిర్యాదులు, వరకట్న వేధింపుల మరణాలకు సంబంధించి 27, పరువు హత్యలు, నేరాల కింద 45 ఫిర్యాదులు అందాయి.
ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పందిస్తూ...

