Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kaala Bhairava | సస్పెన్స్‌కు తెర.. సింగర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన కావ్య కల్యాణ్‌రామ్!

Kaala Bhairava | సస్పెన్స్‌కు తెర.. సింగర్ కాల భైరవతో ప్రేమలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన కావ్య కల్యాణ్‌రామ్!

Kaala Bhairava | టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావ్య కల్యాణ్‌రామ్ ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

కొంతకాలంగా ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ కాల భైరవతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్‌షిప్‌పై నేరుగా స్పందించలేదు. తాజాగా కావ్య చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ సస్పెన్స్‌కు తెరపడింది.ఆగస్టు 31న కావ్య కల్యాణ్‌రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేస్తూ తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.

"Life update: I found My Yellow Paper Daisy" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ద్వారా కాల భైరవే తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అని కావ్య చెప్పకనే చెప్పారు. కాల భైరవ గురించి కావ్య తన పోస్ట్‌లో ఎంతో ప్రేమగా, భావోద్వేగంగా రాసుకొచ్చారు. కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనం దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలమనే భావన కలిగిస్తారని పేర్కొన్నారు. అలాగే జీవితంలో సరైన వ్యక్తి ఎదురైనప్పుడు 'రోజ్-టింటెడ్ గ్లాసెస్' పెట్టుకుని ప్రపంచాన్ని చూడటం కూడా అంత చెడ్డ విషయం కాదంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. తన సాధారణమైన రోజులను సైతం ప్రత్యేకంగా మార్చినందుకు భైరవకు కావ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్ల తాను ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలిగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత ప్రత్యేకమైనదో ఆమె పోస్ట్ ద్వారా స్పష్టమైంది.

అంతేకాదు.. తనకు డైట్ కోక్ కావాలని చెప్పి, ఆ తర్వాత వద్దని చెప్పినా కూడా తనకు అది కావాలని గుర్తుపెట్టుకునేంత కాలం భైరవ తన జీవితంలో ఉండాలని సరదాగా కోరుకున్నారు. ఈ మాటలు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కావ్య కల్యాణ్‌రామ్, కాల భైరవ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది వీరిద్దరూ కొన్ని సందర్భాల్లో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కూడా కావ్య, భైరవ కలిసి హాజరైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఏదో ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఆ సమయంలో తమ బంధంపై ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.ఇప్పుడు కావ్య స్వయంగా సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్‌తో ఇన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana