Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కారేపల్లి శివాలయ అభివృద్ధికి బెల్‌ డీజీఎం శ్రీకారం

కారేపల్లి శివాలయ అభివృద్ధికి బెల్‌ డీజీఎం శ్రీకారం

కారేపల్లి, ఆగస్టు 30 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న పురాతన శివాలయ అభివృద్ధికి ప్రముఖ బెల్‌ కంపెనీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (డీజీఎం) గుగులోత్‌ రవి శ్రీకారం చుట్టారు.

గర్భగుడికి ఆనుకుని ఉన్న మండపం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ విషయాన్ని రవి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆదివారం ఆలయాన్ని సందర్శించిన ఆయన.. మండప నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 12 పిల్లర్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్‌ ఎర్ర నరసింహారావు, కమిటీ సభ్యుడు సూర్యదేవర వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు, ప్రెస్‌ క్లబ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana