Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కార్మికుల వేతనాల పెంపులో పారదర్శకత లేదు

కార్మికుల వేతనాల పెంపులో పారదర్శకత లేదు

  • మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

హనుమకొండ, మే 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన కార్మికుల వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు లేవని మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాసర్‌ విమర్శించారు.

కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. పెరిగిన వేతనాలు నాలుగు కేటగిరీలలో అన్‌సిల్డ్‌ వరర్లకు రూ.16 వేలు, సెమీసిల్డ్‌ వరర్లకు రూ.17 వేలు, సిల్డ్‌ వరర్లకు రూ.18,500, హైసిల్డ్‌ వరర్లకు రూ.20 వేలు పెంచినట్లు సీఎం ప్రకటించారు. ఇందులో ఒక అన్‌సిల్డ్‌ వరర్ల తప్ప మిగతా వారికి బేసిక్‌ కరువు భత్యం కలుపుకొని ఇప్పటికే వస్తున్న జీతానికి, పెరిగిన దానికి పెద్ద తేడా లేదన్నారు.

కాంట్రాక్టులేబర్‌ జీవో 11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులకు రూ.13098 నుంచి 23,683 వరకు వేతనాలు పొందుతున్నారని, దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమీ లేదని విమర్శించారు. జీవోలో సిల్డ్‌ కార్మికునికి రూ.19572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం 18,500 మాత్రమేనని గతంతో పోలిస్తే 1072 రూపాయల తగ్గిందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా కనీస వేతనాల సలహా మండలి బోర్డు అన్‌సిల్డ్‌ కార్మికుడికి కనీస వేతనం రూ.18,009 కరువుభత్యాన్ని ఒకొక పాయింట్‌కు రూ.12 సిఫార్సు చేశారని గుర్తు చేశారు. ఉన్న వేతనాల కంటే కూడా తకువగాఉన్న వేతన సవరణను పునఃసమక్షించాలని వినయ్‌ భాస్కర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana