Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కలలోనే కటౌట్స్‌ కడతాం!

కలలోనే కటౌట్స్‌ కడతాం!

ల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'రంభ ఊర్వశి మేనక'. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

సురభి, రాశిసింగ్‌, విష్ణుప్రియ, ప్రిషాసింగ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం టైటిల్‌సాంగ్‌ను విడుదల చేశారు. 'మా ఊరు ఎక్కడో స్వర్గమండీ..అది ఆకాశం అంచునా ఉంటదండీ, అరే దిగివచ్చా పండగే చేసుకోండి, నీ కోసం ఇక్కడే కోట్లమంది..తెగపడి చస్తా ఉంటరే భక్తులండీ..కల్లోనే కటౌట్స్‌ కడతామండీ' అంటూ హుషారుగా ఈ పాట సాగింది.

కథానాయికల నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల్లో ఇదొక విభిన్న ప్రయత్నమని రాశిసింగ్‌ ఆనందం వ్యక్తం చేసింది. హుషారుగా సాగే ఈ గీతం అందరితో డ్యాన్స్‌ చేయించేలా ఉంటుందని, ఆద్యంతం కామెడీతో ఈ సినిమా నవ్వుల్ని పంచుతుందని ప్రిషాసింగ్‌ పేర్కొన్నది. ఈ కథ మొత్తం రంభ, ఊర్వశి, మేనక చుట్టూ తిరుగుతుందని, రెండున్నరగంటల పాటు హాయిగా నవ్వించే సినిమా ఇదని విష్ణుప్రియ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌భరద్వాజ్‌, దర్శకత్వం: చంద్రమోహన్‌ చింతాడ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana