Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kalki 2 | ప్రభాస్ 'కల్కి 2'పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్.. ఇప్పటివరకు జరిగింది ఇంతే!

Kalki 2 | ప్రభాస్ 'కల్కి 2'పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్.. ఇప్పటివరకు జరిగింది ఇంతే!

Kalki 2 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'కల్కి 2'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ముఖ్యంగా తొలి భాగం 'కల్కి 2898 ఏడీ' దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ విజయాన్ని అందుకోవడంతో.. సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.. దీంతో సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందనే విషయం స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ప్రభాస్ తన చేతిలో ఉన్న ఇతర భారీ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ సినిమాల కమిట్‌మెంట్స్ పూర్తయి ఆయన పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత 'కల్కి 2' షూటింగ్‌ను వేగంగా కొనసాగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'కల్కి 2898 ఏడీ'లో భవిష్యత్ ప్రపంచాన్ని, పురాణాలను, సైన్స్ ఫిక్షన్ అంశాలను కలిపి నాగ్ అశ్విన్ సరికొత్త సినిమాటిక్ వరల్డ్‌ను సృష్టించారు. ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ పాత్ర చివర్లో సీక్వెల్‌పై మరింత ఉత్కంఠను పెంచింది.

మొదటి భాగం చివర్లో యాస్కిన్‌కు సంబంధించిన కథను కీలక మలుపులో వదిలేయడంతో.. రెండో భాగంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఎలా ఉండబోతుందనే దానిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'కల్కి 2'లో ప్రభాస్‌తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కొనసాగనున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ విలన్ షేడ్ ఉన్న యాస్కిన్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సీక్వెల్‌లో ఆయన పాత్రకు మరింత ప్రాధాన్యత ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర కూడా కథలో కీలకంగా మారనుంది. తొలి భాగంలో ఈ పాత్రకు వచ్చిన స్పందన నేపథ్యంలో సీక్వెల్‌లో అశ్వత్థామకు సంబంధించిన ఎపిసోడ్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉందనే ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana