Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కన్నడ చిత్రం రీమేక్‌లో నటించనున్న సత్యదేవ్, తమన్నా

కన్నడ చిత్రం రీమేక్‌లో నటించనున్న సత్యదేవ్, తమన్నా

హైదరాబాద్‌ : డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ఇక టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న స్టార్డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో సూపర్‌హిట్‌ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు.

మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా పని చోయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana