Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karnataka CM: సీఎం సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించిన కర్నాటక గవర్నర్

Karnataka CM: సీఎం సిద్దరామయ్య రాజీనామాను ఆమోదించిన కర్నాటక గవర్నర్

బెంగుళూరు: కర్నాటక సీఎం(Karnataka CM) సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ అంగీకరించారు. గురువారం రోజున లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి కి సిద్దరామయ్య తన రాజీనామాను అందజేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం తనకున్న అధికారాల అనుసారం సీఎం సిద్దరామయ్య సమర్పించిన రాజీనామాను స్వీకరిస్తున్నట్లు గవర్నర్ థావర్‌చాంద్ తెలిపారు. సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న మంత్రిమండలిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ తన నోటిఫికేషన్‌లో తెలిపారు.

అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు తాత్కాలిక సీఎంగా సిద్ధరామయ్య కొనసాగాలని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్ధరామయ్యతో పాటు సీఎం అయ్యే అవకాశాలు ఉన్న డీకే శివకుమార్ ఢిల్లీలో ఉన్నారు. అధికార మార్పిడిపై ఆ ఇద్దరూ కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చిస్తున్నారు.

గురువారం అల్పాహార విందులో సిద్ధరామయ్య తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. డీకే శివకుమార్‌ను తన వారసుడిగా ప్రకటించారు. హై కమాండ్ ఆదేశాల ప్రకారం తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Namasthetelangaana